Wednesday, 15 May 2024 02:34:28 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సానుకూల దృక్పధమే సమాజ ప్రగతికి సంకేతం

Date : 29 August 2022 04:30 PM Views : 241

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం: సానుకూల దృక్పధమే సమాజ ప్రగతికి సంకేతం కాగలదని ఏపిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబులో నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ ఐదు రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా హాజరైన కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో పనిచేసే వ్యవస్థలు, వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంటుందన్నారు. సమస్యలను వెలికితీయడమే కాకుండా వాటి పరిష్కార మార్గాలను కూడా మీడియా అన్వేషించాలని పిలుపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా విస్తరించిందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు పరిమితులు ఉన్నా, సోషల్ మీడియాకు ఎటువంటి పరిమితులు లేవన్నారు. అయినప్పటికీ సమాజం కోసం ఆలోచించి సానుకూలంగా ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలో మీడియాకు అత్యున్నత స్థానం ఉందని, నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అణచివేత ధోరణితో కాకుండా వచ్చిన వార్తల్లో నిజానిజాలు తెలుసుకొని లోపాలుంటే దిద్దుకోవాలన్నారు. నిరంతరం వృత్తిలో బిజీగా ఉండే పాత్రికేయులు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యానం, యోగాలాంటి విద్యనభ్యసించి ముందుకు సాగాలన్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు, ప్రింట్, ఎల క్రానిక్ మీడియా జాతీయ స్థాయి నిపుణులు, బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :