Tuesday, 14 May 2024 09:07:57 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఈ సారి ఏడు పేప‌ర్ల‌కు ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు

Date : 29 September 2023 02:58 PM Views : 92

తాజా వార్తాలు / అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సారానికి సంబందించి నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కాంపోజిట్‌ తెలుగు, కాంపోజిట్‌ సంస్కృతం పేపర్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో వచ్చే సంవత్సరం నుంచి ఈ రెండు పేపర్లను తొలగించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కాంపోజిట్‌ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్‌ సంస్కృతం 30 మార్కులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శి పేపర్లకు అమలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏడు పేపర్ల విధానం.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లకు జరగనుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు కలిపి ఒకే పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం మరో పేపర్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఈ రెండు పరీక్షలను ఒకటే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. రెండు పేపర్లకు కలిపి 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. మిగతా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సోషల్‌ పేపర్లు యథావిధిగా ఉంటాయి. తెలుగు, హిందీలో ఎక్కువ మంది విద్యార్ధులు ఫెయిల్‌ అవుతున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. ఇప్పటి వరకు తెలుగు ప్రశ్నపత్రంలో ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించి, దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఇలా పద్యంపై మొత్తం నాలుగు ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులకు ఉంటుంది. ఇక రెండో రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం ఇచ్చి, దాని భావాం రాస్తే 8 మార్కులు ఇచ్చేవారు. దాని స్థానంలో గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాసేలా పరీక్ష విధానం మార్చారు. ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు కేటాయిస్తారు. అలాగే హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చారు. గతంలో తొలగించిన బిట్‌ పేపర్‌ను మళ్లీ తీసుకొచ్చారు. బిట్‌ పేపర్‌లో ఒక మార్కు ప్రశ్నలు 14, రెండు మార్కుల ప్రశ్నలు 19 ఉంటాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :