Tuesday, 14 May 2024 02:56:23 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే వారంతా సీఎంలు.. ముఖ్యమంత్రుల వారసులకు అక్కడ ఆదరణ కరవు.. ఇంట్రెస్టింగ్ అనాలిసిస్

Date : 23 November 2022 07:44 PM Views : 218

తాజా వార్తాలు / అమరావతి : రాజకీయాలు రంజుగా మారుతున్న తరుణంలో ఓ పరిశీలన ఆసక్తి రేపుతోంది. చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.వారి తండ్రులు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో ముఖ్యమంత్రులయ్యారు. కానీ తనయులు, వారసులు మాత్రం ఆ పార్టీలో ఇమడలేకపోయారు. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తాము కోరుకున్న పదవులను పొందారు. ఇంకొందరు ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. రాజకీయాలు రంజుగా మారుతున్న తరుణంలో ఓ పరిశీలన ఆసక్తి రేపుతోంది. చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడంతోనే ఈ రకమైన చర్చ మొదలైందని చెప్పవచ్చు. చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 80వ దశకంలో పార్టీని వీడి, సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 1989లో మరోసారి సీఎం అయ్యారాయన. 1991 హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల నేపథ్యంలో చెన్నారెడ్డి సీఎం సీటును కోల్పోయారు. అయితే అప్పట్లో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా వున్న పీవీ నరసింహారావు.. చెన్నారెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా పంపారు. ఆ తర్వాత ఆయన మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతగా ఓ వెలుగు వెలిగిన చెన్నారెడ్డి వారసులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో పెద్దగా పదవులేం పొందలేదంటే కాదనలేం. చెన్నారెడ్డి ఇద్దరు కుమారుల్లో మర్రి శశిధర్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చెన్నారెడ్డి పెద్ద కుమారుడు మర్రి రవీందర్ రెడ్డి కొంతకాలం యాక్టివ్ పాలిటిక్స్‌లో వున్నప్పటికీ పెద్దగా పదవులేం నిర్వహించలేదు. శశిధర్ రెడ్డి మాత్రం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి తన తండ్రి చెన్నారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 1992 ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1994, 2004, 2009లలో మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో కేంద్రంలో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం ఆయనకు జాతీయ పదవిని కట్టబెట్టింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA)కి ఛైర్మెన్‌గా శశిధర్ రెడ్డిని నియమించారు. తాజాగా పార్టీలో తన ప్రాభవం కనుమరుగవుతుందని గ్రహించిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు.ఈకోవలో ముందుగా చెప్పుకోవాల్సింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్నే. 1998లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2003లో చేపట్టిన పాదయాత్ర తర్వాత పార్టీలో సీఎం క్యాండిడేట్ అంటే రెండో పేరు వినిపించకుండా చేశారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలో అసంతృప్తి వున్నా అసమ్మతి లేవకుండా పట్టుభిగించారు. పరిణామాలను ముందే ఊహించిన మాజీ మంత్రి మైసూరా రెడ్డి లాంటి వారు ముందే బిచాణా సర్దుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోగా.. పార్టీలోనే వుండిపోయిన జేసీ దివాకర్ రెడ్డి, పి.జనార్ధన్ రెడ్డి లాంటి వారిని కట్టిపడేవారు. జేసీకి మంత్రిపదవినిచ్చిన వైఎస్ఆర్.. పీజేఆర్‌ని మాత్రం పెద్దగా ఖాతరు చేయలేదు. ఈక్రమంలోనే పీజేఆర్.. 2007లో గుండెపోటుతో మరణించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి వైఎస్ఆర్.. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఎదురే లేని నేతగా మారారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలన్నీ ఒకవైపు.. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒకవైపు అన్న పరిస్థితిలో ఒంటిచేత్తో రెండోసారి పార్టీని గెలిపించారు. మరోమారు సీఎం సీటుపై కూర్చున్నారు. కానీ విధి వక్రించింది. రెండోసారి సీఎం అయిన మూడున్నర నెలలకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వైఎస్ తర్వాత సీఎం ఎవరన్న ప్రశ్న అప్పటి వరకు కనీసం ఊహకు కూడా ఎవరికీ రాలేదు. కానీ ఆయన మరణం తర్వాత పరిణామాలు మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా వున్న వైఎస్ కుటుంబం ఒక్కసారిగా దూరమైంది. తండ్రి తర్వాత సీఎం కావాలనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతాన్ని సోనియా తోసిపుచ్చడంతో పరిస్థితిలో మార్పు వచ్చేసింది. రోశయ్యను సీఎం చేసిన సోనియా.. అప్పటికే ఎంపీగా వున్న జగన్ మోహన్ రెడ్డి పట్ల అచీతూచీ వ్యవహరించారు. ఈక్రమంలోనే సొంత ఇమేజీపై వ్యూహరచన చేసిన జగన్.. వైఎస్ఆర్ వారసునిగా ప్రజలు తననే గుర్తించేలా కార్యక్రమాలను రూపొందించుకున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ మరణం తర్వాత గుండాగి మరణించిన వారి కుటుంబాల పరామర్శకు బయలుదేరారు. ఓదార్పు యాత్రగా దానికి నామకరణం చేసుకున్నారు. అయితే, ఓదార్పు యాత్రకు అనుమతి విషయంలో కాంగ్రెస్ పార్టీలో హైడ్రామానే నడిచింది. చివరికి జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికలపై కన్నేశారు. వైఎస్ఆర్ సెంటిమెంటును కొనసాగిస్తూ 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు యత్నించారు. కానీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది ? 2014లో మరోసారి విజయం సాధించే లక్ష్యంతో సోనియా తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర విభజన చంద్రబాబుకు అనుకూలంగా మారడంతో సీఎం కావాలన్న జగన్ కలను వాయిదా వేసింది. అయితేనేం.. అయిదేళ్ళపాటు వివిధ ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారు. చివరికి 2019లో తాననుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఏపీకి సీఎం అయ్యారు. తండ్రి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో సీఎం అయితే, కుమారుడు కాంగ్రెస్ వీడి, పట్టుబట్టి, పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు. 1971 జైఆంధ్ర ఉద్యమం తర్వాత కీలక సమయంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్ రావు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్ రావు.. కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో దిగ్గజ నేతగా పేరుగాంచిన కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రావు కూడా చిరకాల అనుబంధాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆయన తన సతీమణి కోట్ల విజయమ్మతో కలిసి తెలుగుదేశంపార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అపర ఛాణక్యునిగా పేరుగాంచిన అయిదేళ్ళపాటు మైనారిటీ ప్రభుత్వ సారథిగా దేశాన్ని ఏలిన తెలంగాణతేజం పీవీ నరసింహారావు వారసురాలు వాణీదేవి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. పీవీ నరసింహారావు 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ఉమ్మడి ఏపీ సీఎంగా కొంతకాలం కొనసాగారు. ఆయన తనయులు రాజేశ్వర్ రావు, రంగారావు ఎమ్మెల్యేలు కాగలిగినా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాభవం పొందలేకపోయారు. తాజాగా పీవీ తనయ వాణీదేవి టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్సీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చతురునిగా పేరుగాంచిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. కార్పోరేషన్ చైర్మెన్ అయ్యారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :