Wednesday, 15 May 2024 03:16:01 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

అప్పుడే పుట్టిన పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆసుపత్రుల్లోనే ఆ సౌకర్యం..

Date : 29 August 2022 04:20 PM Views : 274

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్.. తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి ఏపీ వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులకు అవసరమైన ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్ లను సమకూర్చనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేపట్టనున్నారు. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యుఐడిఏఐ ఓ పరీక్షను నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ మొదలుకానుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేయనున్నారు. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటాతో పని లేదు. పిల్లల ఫోటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు అప్పటికప్పుడు తాత్కాలిక ఆధార్ కార్డును జారీ చేయనున్నారు. సాధారణంగా పిల్లలు పెరిగిన తర్వాత.. వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏరియా అధికారుల నుంచి ధ్రువపత్రం, చిరునామా పలు ఆధారిత వివరాల ప్రకారం ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే.. ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. దీంతో తల్లిదండ్రులు పథకాలకు అర్హత, పలు సందర్భాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :