Tuesday, 14 May 2024 12:27:50 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

రూ. 2వేల నోటు ఉపసంహరణపై ఎన్నో ప్రశ్నాలు.. ఆర్‌బీఐ ఏం చెబుతోంది...

Date : 20 May 2023 11:34 AM Views : 250

తాజా వార్తాలు / అమరావతి : రూ. 2 వేల నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రూ. 2 వేల నోటు ఉపసంహరణ అంశం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ 2023, మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే దీనిపై ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రూ. 2 వేల నోటు ఉపసంహరణపై ఉన్న అనుమాలు ఏంటి.? నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. * నోట్ల మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఏదైనా ఫీజు చెల్లించాలా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. నోట్ల మార్చుకోవడానికి ఏ ఫీజూ చెల్లించే అవసరం లేదని, ఉచితంగానే మార్చుకోవచ్చని పేర్కొంది. * వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవడానికి వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. * 2 వేల నోట్లను ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా, మార్చుకోకపోయినా ఏమవుతుందన్న విషయంపై ఆర్బీఐ ఓ సమాధానం చెప్పింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా 5 నెలల గడువు ఇచ్చామని చెప్పింది. ఆ సమయంలో 2 వేల నోట్లు మార్చుకోవాలని లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని పేర్కొంది. ప్రజలను ఈ మేరకు ప్రోత్సహిస్తున్నామని మాత్రమే ఆర్బీఐ చెప్పింది. * ఒకవేళ బ్యాంకులో రూ.2 వేల నోట్లను తీసుకోకపోతే ఏంటి సంగతన్న విషయంపై కూడా ఆర్బీఐ వివరణ ఇచ్చింది. మొదట ఆ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. * రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని నోటును రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. * రూ. 2 వేల నోట్లు ఉన్న వారు సెప్టెంబరు 30లోపు ఏ బ్యాంకులోనైనా తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు. లేదంటే మార్చుకోవచ్చని తెలిపింది. * ఇక రూ. 2 వేల నోట్ల మార్పిడి పరిమితిపై స్పందించిన ఆర్‌బీఐ కేవైసీ, ఇతరత్రా చట్టబద్ధమైన, నియంత్రణ పరమైన నిబంధనలకు లోబడి ఎలాంటి నియంత్రణ లేకుండా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది. * నోటు మార్చుకోవడానికి బ్యాంకు ఖాతాదారుడై ఉండాల్సిన అవసరం లేదని, ఖాతాలేని వారు కూడా ఒక్కోసారి బ్రాంచ్‌ల్లో రూ.20వేల విలువైన నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :