Tuesday, 14 May 2024 04:36:38 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు డిమాండ్‌

Date : 22 August 2022 11:40 AM Views : 307

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుకై తిరుపతిలో జరుగు కార్మికశాఖా మంత్రుల సమావేశాలకు వ్యతిరేకంగా నిరసనలకు కార్మిక సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రణస్థలంలో ఆర్.సి.ఎమ్ స్కూల్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా నాలుగు లేబర్ కోడ్లు గా మార్చి వాటిని అమలు చేసేందుకు ఆగస్టు 25, 26 తేదీల్లో తిరుపతి నగరంలో సమావేశాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు మరియు వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్ పై కేంద్రం సూచనలతో రాష్ట్రంలో అనుబంధంగా రూల్స్ ను ప్రతిపాదించిందని ఆందోళన వ్యక్తం చేసారు. లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కనీసమైన చర్చ కూడా జరపకుండా ఏకపక్షంగా ఆమోదించిందని విమర్శించారు. ప్రతిపక్షాలు తీవ్రమైన నిరసన ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన లేబర్ కోడ్స్ ను బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే లేబర్ కోడ్స్ కు అనుబంధంగా రూల్సును రాష్ట్రాల చేత ఆమోదించపచేయాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా హడావుడిగా లేబర్ కోడ్స్ కు రూల్సును ఆమోదించాలని చూస్తుందని విమర్శించారు. బ్రిటీష్ కాలం నుండి కార్మికవర్గం పోరాడి సాధించుకున్న అనేక హక్కులను తొలగిస్తూ నేడు లేబర్ కోడ్స్ ను రూపొందించడం జరిగింద‌ని అన్నారు. రాజ్యాంగం అనుమతించిన సంఘ స్వేచ్ఛ, సమిష్టి బేరసారల హక్కు, సమ్మె హక్కులను దేశంలోని కార్మికవర్గం కోల్పోతున్నదని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు నామమాత్రం చేయబోతున్నారని, ఈపీఎఫ్, ఈఎస్ఐ పథకాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు పెట్టకుండానే నోటిఫికేషన్ ద్వారా మార్చే అధికారం తీసుకున్నదని అన్నారు. న్యూ పెన్షన్ స్కీమ్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వ్యాపారం ఇచ్చే విధంగా కోడ్లు రూపొందించింది. కార్మికుల పనిగంటలు, వారాంతపు సెలవులు తదితర పని పరిస్థితులతో పాటు పని ప్రదేశంలో భద్రత మరియు ఆరోగ్యాలకు సంబంధించిన నిబంధనలను నోటిఫికేషన్ ద్వారా నిలుపు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోడ్లు ఇచ్చాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే మూసివేతలు, తొలగింపులు మరియు లే ఆఫ్లకు సంబంధించిన కార్మికుల సంఖ్యను నోటిఫికేషన్ ద్వారా ఎంతకైనా పెంచుకునే అవకాశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చాయి. చట్టాలను అమలు జరిపి, ఉల్లంఘించే యజమానులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుని కార్మికులకు రక్షణ కల్పించేదిగా ఉండాల్సిన కార్మికశాఖను యజమానులకు కార్మికులకు మధ్య ఫెసిలిటేటర్గా మార్చివేయడం ద్వారా కార్మిక చట్టాల అమలు పర్యవేక్షించే వారు ఎవరూ మిగలరని అన్నారు. స్ప్రెడ్ ఓవర్ను పెంచడం ద్వారా కార్మికుల పనిగంటలు పెంచే అవకాశాన్ని యజమా నులకు ఇచ్చినట్లయింది. కొత్త పరిశ్రమలకు కార్మిక చట్టాలు వర్తించకుండా అనేక రాయితీలిచ్చారు. కనీస వేతన నిర్వచనం మారిపోతున్నది. వేతన పెరుగుదల కలగా మిగిలిపోతున్నది. ఇప్పటికే పారిశ్రామిక ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అన్యాయంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. లేబర్కోడ్స్ యజమానులపై శిక్షలను బాగా తగ్గించారు. దీని వల్ల ప్రమాదాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. లేబర్ కోడ్స్ అమలైతే పారిశ్రామిక ప్రమాదాల్లో యజమానులకు ఏ బాధ్యత ఉండదు. కార్మికశాఖ పర్యవేక్షణ ఉండదు. ఏ సమ్మె అయినా చట్ట విరుద్ధంగా ప్రకటించి కార్మికులను శిక్షించడానికి కోడ్స్ అవకాశం కల్పించాయి. ఏ విధంగా చూసినా కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ లేబర్ కోడ్స్ యజమానుల పక్షాన రూపొందింపబడ్డాయని అన్నారు. ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్స్ (ఎఫ్.ఆర్.ఇ) పేరుతో శాశ్వత ఉద్యోగాలనేవి శాశ్వతంగా లేకుండా చేయడం ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నదని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆగ్నిపథ్ కూడా అందులో భాగమేనని అన్నారు. శాశ్వత ఉద్యోగాలను శాశ్వతంగా లేకుండా చేయడం లేబర్ కోడ్లో ఒక ముఖ్యమైన అంశం. కార్మికులను ఆధునిక బానిసలుగా పనిచేయించడమే లేబర్ కోడ్స్ లక్ష్యం. నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అని వారికి ఊడిగం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు పొందిన జాతీయ కార్మిక సంఘాలన్నింటితో తక్షణం సంయుక్త సమావేశానికి ఏర్పాటు చేసి ఈ లేబర్ కోడ్స్ రూల్స్ ను చర్చించాలని డిమాండ్ చేసారు. ఐ.నారాయణరావు, టి.భాను, టి.ఆదిలక్ష్మి, పి.మహాలక్ష్మినాయడు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :