Tuesday, 14 May 2024 11:50:21 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

‘వ్యూహం’లో మార్పు.. మళ్లీ జ‌నంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్‌..!

Date : 22 November 2023 12:52 PM Views : 262

తాజా వార్తాలు / అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ తొమ్మిదో తేదీన భ‌విష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల ప‌ర్యట‌న‌లో ఉండ‌గా చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ త‌ర్వాత చంద్రబాబు జైలుకి వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవ‌ల చంద్రబాబుకు ఆరోగ్య కార‌ణాల‌తో హైకోర్టు ఈనెల 28 వ‌ర‌కూ మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఈనెల 20వ తేదీన చంద్రబాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. మ‌ధ్యంతర బెయిల్‌తో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్రబాబు హైద‌రాబాద్‌లో వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. ఆ త‌ర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుప‌త్రిలో కాట‌రాక్ట్ స‌ర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే, కోర్టు విధించిన ష‌ర‌తుల‌కు లోబ‌డి ఆయ‌న రాజ‌కీయంగా కూడా కొన్ని అంత‌ర్గత స‌మావేశాలు నిర్వహించుకున్నారు. మిత్రప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా చంద్రబాబు స‌మావేశ‌మై భ‌విష్యత్ వ్యూహాల‌పై ఓ నిర్ణయానికి వ‌చ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన రెగ్యుల‌ర్ బెయిల్ తో చంద్రబాబుకు భారీ ఊర‌ట ల‌భించింది. న‌వంబ‌ర్ 29 వ తేదీ నుంచి చంద్రబాబు ర్యాలీలు, రాజ‌కీయ ప‌ర‌మైన స‌మావేశాల్లో పాల్గొన‌వ‌చ్చని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వుల‌తో చంద్రబాబు రాక‌ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి.చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు. మంగ‌ళ‌గిరిలోని కేంద్ర కార్యాల‌యానికి ఎప్పుడు వ‌స్తారు..? ప్రజ‌ల్లోకి ఎప్పటి నుంచి వస్తారనే విషయాలపై పార్టీ కేడ‌ర్ లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే టీడీపీ ముఖ్య నేత‌ల స‌మాచారం ప్రకారం ఈనెల 29 నుంచి చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటార‌ని తెలిసింది. త్వర‌లోనే మ‌ళ్లీ ప్రజ‌ల్లోకి వెళ్తార‌ని కూడా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాల‌ని చంద్రబాబు, లోకేష్ నిర్ణయం.. హైకోర్టు ఆదేశాల‌తో చంద్రబాబు రాజ‌కీయ‌ప‌ర‌మైన కార్యక్రమాల్లో పాల్గొన‌డానికి రూట్ క్లియ‌ర్ అయింది. ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా చంద్రబాబు పాల్గొనే చాన్స్ ఉంది. దీంతో చంద్రబాబు రీ ఎంట్రీ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న స‌మ‌యంలోనే జ‌న‌సేన పార్టీతో పొత్తు కుదిరింది. పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత రెండు పార్టీల‌ను లోకేష్, అచ్చెన్నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు ముందుకు న‌డిపిస్తున్నారు. రెండు పార్టీలు క‌లిసి ఉమ్మడిగా ఆందోళ‌న‌లు కూడా నిర్వహిస్తున్నాయి.. ఇక చంద్రబాబు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 29 న చంద్రబాబు ప్రజ‌ల ముందుకు వస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య కార‌ణాల‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలు రూప‌కల్పన చేయాల‌నే ఆలోచ‌న‌తో పార్టీ వ‌ర్గాలున్నాయి. గ‌తంలో నిలిచిపోయిన బాబు ష్యూరిటీ-భ‌విష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మ‌ళ్లీ ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే జ‌న‌సేన కూడా టీడీపీతో క‌ల‌వ‌డంతో ఈ కార్యక్రమం పేరు మార్పు చేసి ప్రజ‌ల్లోకి వెళ్తార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాబు అరెస్ట్ అయిన నంద్యాల నుంచే ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ని స‌మాచారం.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :