Wednesday, 15 May 2024 02:19:36 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

స్మార్ట్‌వాచ్‌లు హార్ట్ బీట్‌ని ఎలా లెక్కిస్తారో మీకు తెలుసా.?

Date : 23 January 2023 08:20 PM Views : 297

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక సాధానం మాత్రమే. కానీ నేడు స్మార్ట్‌ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది. బాడీ టెంపరేచర్‌ నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను చెప్పేస్తున్నాయి. వాతావరణం అలర్ట్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లకు స్మార్ట్‌ వాచ్‌లు పెట్టింది పేరు. ఇలాంటి ఫీచర్స్‌లో హార్ట్ బీట్ ఒకటి. చేతికి ధరించిన స్మార్ట్ వాచ్‌ మన హార్ట్‌ బీట్‌ను ఎలా లెక్కిస్తుందనే సందేహం రావడం సర్వసాధారణమైన విషయమే.? అయితే స్మార్ట్‌ వాచ్‌ హార్ట్‌ బీట్‌ను ఎలా లెక్కగడుతుంది.? అసలు దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం..హార్ట్‌ బీట్‌ను లెక్కగట్టడానికి స్మార్ట్‌ వాచ్‌లో ఫొటోఫ్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలాగే స్మార్ట్‌ ఫోన్‌కు వెనకాల గ్రీన్‌ లైట్‌ వెలుగుతుండడాన్ని గమనించే ఉంటారు. ఈ గ్రీన్‌ లైటే మన హార్ట్‌బీట్‌ను లెక్కిస్తుంది. స్మార్ట్‌వాచ్‌ నుంచి వచ్చే గ్రీన్‌ లైట్‌ చేతి గుండాలోపలికి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఎరుపు రక్తంలో ఉండే బ్లడ్ గ్రీన్‌ కలర్‌ని అబ్జర్వ్‌ చేసుకుంటుంది. అయితే రక్తం లేని చోట గ్రీన్‌ లైన్‌ రిఫ్లక్ట్ అవుతుంది. రిఫ్లక్ట్ అయిన ఆ గ్రీన్‌ లైట్‌ వాచ్‌లో ఉండే ఆప్టికల్‌ సెన్సార్‌ను క్యాప్చర్‌ చేస్తుంది.గుండె కొట్టుకునే సమయంలో రక్తం శరీరం గుండా ప్రవహిస్తుందనే విషయం తెలిసిందే. చేతిలో ప్రవహించే ఈ రక్త ప్రసారణ ఆధారంగానే స్మార్ట్‌వాచ్‌లోని గ్రీన్‌ లైట్‌ గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. హార్ట్‌బీట్‌ని బట్టి చేతిలో ప్రవహించే రక్తంలో హెచ్చుతగ్గుల ఆధారంగానే హార్ట్‌ బీట్‌ను స్మార్ట్‌ వాచ్‌ లెక్కిస్తుంది. ఇదంటీ స్మార్ట్‌ వాచ్‌ వెనకాల ఉన్న అసలు టెక్నాలజీ.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :