Tuesday, 14 May 2024 08:57:43 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తల్లి నుంచి తప్పిపోయిన బుజ్జి పులులు.. వాటికి ఏం ఆహారం ఇస్తున్నారంటే..

Date : 07 March 2023 01:42 PM Views : 136

తాజా వార్తాలు / కడప జిల్లా : ఒకటి కాదు.. నాలుగు.. బుజ్జి పిల్లులు కాదు.. పెద్ద పులులే.. కానీ బుజ్జి పులులు. ఎరక్కపోయి జనావాసాల్లోకొచ్చి చిక్కుకుపోయాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంత సమీప గ్రామంలో జనం కంటబడ్డ నాలుగు ఆడ పులిపిల్లలు స్థానికంగా కలకలం రేపాయి. ఉదయాన్నే అడవివైపు వెళుతోన్న ఓ వ్యక్తికి నాలుగు పెద్దపులి పిల్లలు కంటపడడంతో హడలిపోయాడు ఆ వ్యక్తి.. ఆ తరువాతేం జరిగిందో చూడండి..కర్నూలు జిల్లాలో ముళ్ళపొదల్లో ప్రత్యక్షం అయిన నాలుగు పులిపిల్లలు స్థానికంగా కలకలం రేపాయి. నల్లమల సమీపంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెద్దగుమ్మడాపురంలో ముళ్ళపొదల్లో నాలుగు పులిపిల్లలు జనం కంటబడ్డాయి. జనాన్ని చూసి హడలిపోయిన పులి పిల్లలను జనం ఓ చోట దాచిపెట్టారు. పులి పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. వాటిని తీసుకెళ్లి ఓ గదిలో భద్రపరిచిన గ్రామస్తులు, అటవీశాఖాధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. బహుశా సమీపంలోని నల్లమల అడవిలో నుంచి తప్పించుకుని ఊరిచివర పంటపొలాల్లోకి చొరబడి ఉంటాయని భావిస్తున్నారు.ఈ పులిపిల్లలను అటవీప్రాంతంలో వదిలేస్తే ఇతర జంతువులు చంపేసే ప్రమాదం ఉందని అటవీశాఖాధికారులు ఆందోళనకు గురయ్యారు. పులిపిల్లలు దొరికిన చోటనే వాటిని వదిలేసి సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని మొదట భావించినా ఆ తరువాత నాలుగు పెద్దపులి పిల్లలను బైర్లూటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించారు అధికారులు. అధిక వేడి దృష్ట్యా డీహైడ్రేషన్ కు గురవుతాయని వాటి ఆరోగ్య పరిస్తితి మెరుగు పడ్డాక రాత్రికి తల్లి, పిల్లలను కలిపే ప్రయత్నం చేస్తామని, వీలుకాని పక్షంలో తిరుపతి జూ కు తరలిస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు ఆ బుల్లి పులుల తల్లి ఎక్కడో చుట్టుపక్కలే పొంచి ఉంటుందని సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. కాగా, తల్లి లేకపోవడంతో ఆ పులి పిల్లలు ఆహారం తీసుకోవడం లేదు. దాంతో అధికారులు చాలా జాగ్రత్తగా వాటికి ఫీడింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బైర్లుటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఆ పులి పిల్లలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయని, పశువుల పాలు, ఓఆర్ఎస్, నీళ్లుు పులి పిల్లలకు ఆహారంగా అందిస్తున్నారు సిబ్బంది. తల్లి పెద్దపులి కోసం 40 ట్రాప్ కెమెరాలతో పర్యావేక్షిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఏ కెమెరాలో అయితే పులి కనబడుతుందో ఆ ఏరియాలో పులి పిల్లలను వదిలి తల్లితో కలుపుతామని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :