Tuesday, 14 May 2024 05:11:55 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మహిళలకు పండగే.. అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి ‘ఆసరా’ నిధులు జమ చేసిన సీఎం జగన్‌

Date : 25 March 2023 08:01 PM Views : 196

తాజా వార్తాలు / అమరావతి : అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు సీఎం జగన్‌ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం 'వైఎస్సార్‌ ఆసరా'. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే వేల కోట్ల రూపాలయను మహిళల ఖాతాల్లోకి జమ చేసిన జగన్‌ సర్కార్‌ ఇవాళ (మార్చి 25) మూడో విడత నిధులు విడుదల చేసింది.అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు సీఎం జగన్‌ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ‘వైఎస్సార్‌ ఆసరా’. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే వేల కోట్ల రూపాలయను మహిళల ఖాతాల్లోకి జమ చేసిన జగన్‌ సర్కార్‌ ఇవాళ (మార్చి 25) మూడో విడత నిధులు విడుదల చేసింది. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన బహిరంగ కార్యక్రమంలో బటన్ నొక్కి రూ.6,419.89 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్‌ తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమన్నారు. అలాగే రాష్ట్రంలోని పొదుపు సంఘాలు దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచాయని ప్రశంసలు కురిపించారు. ‘వైఎస్సార్‌ ఆసరా మూడో విడతలో భాగంగా రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ పథకంలో ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిచి పెట్టాను. స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ఉంటాయి. అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం. మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా ప్రభుత్వం నిలబడుతుంది. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. ఈ నిధులతో 9 లక్షల మందికిపైగా నా అక్క చెల్లెమ్మలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. రూ.4355 కోట్లను బ్యాంకుల ద్వారా వారికి అనుసంధానం చేశాం. తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారు దేశానికే రోల్‌ మోడల్‌గా.. గతంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతున్నాయి. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నాయి. తద్వారా దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయి. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నాం. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం.. మళ్లీ ఊపిరి పోసుకుంది. ఎన్‌పీఏలు, ఓవర్‌ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమే. ఇది గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం. రుణాలు మాఫీచేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారు. వారిని నిలువునా ముంచేశారు. 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీరుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారు. రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి దాపరించింది. మేం అధికారంలోకి వచ్చాక తిరిగి సున్నావడ్డీ కిందరుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చాం. 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించాం. చిక్కటి చిరునవ్వుతోనే ఇదంతా చేశాం. మహిళా పక్షపాత ప్రభుత్వం మనది.నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకే.. ‘ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేవాలయాల ఛైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం. ఇందులో 1.17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు. 21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నా’ అని పేర్కొన్నారు సీఎం జగన్‌.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :