Tuesday, 14 May 2024 11:42:23 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి యుద్ధం జరిగి నేటితో 266 ఏళ్లు పూర్తి..

Date : 24 January 2023 11:06 AM Views : 211

తాజా వార్తాలు / విజయనగరం : తెలుగు నేలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి.. అయినప్పటికీ చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషాగ్నికి ప్రతీక గా లీచింది బొబ్బిలి యుద్ధం. వీర పరాక్రమం, వెన్నుపోటు, పగ, ప్రతీకారానికి ప్రతీక అయిన బొబ్బిలి యుద్ధం ఒకరోజుతోముగియడం విశేషం. 1757 జనవరి 24 జరిగిన ఈ యుద్ధానికి నేటితో 266 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక బొబ్బిలి యుద్ధం జరిగి రెండున్నర శతాబ్దాలు దాటుతున్నా ఆ యుద్ధ గాధ తెలుగునోట ఎక్కడో ఓ చోట వినిపిస్తునే ఉంటుంది. బొబ్బిలి యుద్దం జరిగిన చోట, బొబ్బిలి కోట నెలమట్టమైన చోట స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి 24న కోటలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా బొబ్బిలి యుద్ధస్తూపం వద్ద యుద్ధ వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు బొబ్బిలి రాజ వంశీయులు. నాడు యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, తుపాకుల్లాంటివన్నింటినీ కోటలో సందర్శనకు ఏర్పాటు చేశారు. సింహాసనం సహా అనేక వస్తువులతో కలిపి మ్యూజియంగా ఉంచి వారసత్వ సంపదను సంరక్షిస్తున్నారు.నాడు విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య హోరాహోరీగా జరిగిన యుద్ధ చరిత్ర నేటికీ ఆ విషాదఛాయలు, యుద్ధ వీరుల త్యాగాలు అందరికి గుర్తుండిపోయాయి. యుద్ధకారణంగా ఇటు బొబ్బిలి రాజులు, బొబ్బిలి సేన హతమైతే తమ వారి పై జరిగిన దాడికి ప్రతిదాడిగా అదే రోజు గుడారం లో సేద తీరుతున్న విజయనగరం గజపతిరాజు అయిన పెదవిజయరామరాజును హతమార్చాడు తాండ్రపాపారాయుడు.. ఆ యుద్ధం కారణంగా ఇరు సామ్రాజ్యాలు రాజులని కోల్పోయి.. తీవ్రంగా నష్టపోయాయి.. బొబ్బిలి కోటలో మరింత విషాదం నెలకొంది.. యుద్ధం తరువాత మహిళల పై దాడులు జరుగుతాయన్న కారణంగా మహిళలు, చిన్నారులు ఆగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు.. ఈ ఘటనలు ఇప్పటికీ జిల్లావాసులను కలిచివేస్తుంటాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :