Wednesday, 15 May 2024 05:01:25 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీలో 165 మండలాల్లో తీవ్ర వడగాడ్పులకు ఛాన్స్..

Date : 20 April 2023 09:22 AM Views : 241

తాజా వార్తాలు / అమరావతి : బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా.. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు జనాలు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకున్నా తట్టులేని పరిస్థితి నెలకొంది. పొరపాటున పని మీద బయటకు వస్తే మాడు పగిలిపోతుంది. ఈ ఎండలు ఇలా ఉంటే.. వాతావరణ కేంద్రం ప్రకటన మరింత భయపెట్టిస్తున్నాయి. వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ), విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 125 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ఇక శుక్రవారం 40 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక మెసెజ్ అందినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం: 13 విశాఖపట్నం: 2 అల్లూరి జిల్లా: 7 అనకాపల్లి:15 ఏలూరు: 2 తూర్పు గోదావరి: 4 కాకినాడ: 10 గుంటూరు: 11 ఎన్టీఆర్: 12 కృష్ణా: 4 మన్యం: 11 పల్నాడు: 5 విజయనగరం: 23 వైఎస్సార్ జిల్లా: 6, ఈ మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. ఇక, బుధవారం నాడు అనకాపల్లి జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలోని ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :