Wednesday, 15 May 2024 02:06:18 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

కడలి అలల హోరులో.. నేవీ మారథాన్ పరుగు జోరు.. మామ్ అండ్ డాడ్‌తో మేము సైతం అన్న చిన్నారులు..

Date : 05 November 2023 04:17 PM Views : 96

తాజా వార్తాలు / విశాకపట్నం జిల్లా : విశాఖ బీచ్ రోడ్ లో వైజాగ్ నేవీ మారథాన్ -2023 ఉత్సాహంగా సాగింది. ఇప్పటివరకు విశాఖలో ఏడుసార్లు ఈ మారథాన్ నిర్వహించారు. ఈరోజు ఎనిమిదో ఎడిషన్ మారథాన్ లో విశాఖవాసులు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా మారథాన్లో పాల్గొన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె, 5కే విభాగాల్లో పరుగు నిర్వహించారు.సుందర సాగర తీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. తెల్ల తెల్లవార జాము.. ఆదివారం.. లేలేత సూర్యుని కిరణాలు పలకరిస్తుండగా పరుగు పెడుతుంటే.. ఆ అనుభూతే వేరు. ఎక్కడలేని శక్తి మొత్తం ఒక్కసారిగా వచ్చినట్టు.. పట్టలేనంత ఉత్సాహం. వెరసి వైజాగ్ నేవీ మారథాన్ – 2023 ఉత్సాహంగా హుషారుగా సాగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, క్రీడాకారులతో సాగర తీరం కిక్కిరిసిపోయింది. మామ్ అండ్ డాడ్ తో మేము సైతం అంటూ చిన్నారులు, బుజ్జాయిలు ఉత్సాహంగా మారథాన్ లో పాల్గొనడం విశేషం.సుందర సాగర తీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. తెల్ల తెల్లవార జాము.. ఆదివారం.. లేలేత సూర్యుని కిరణాలు పలకరిస్తుండగా పరుగు పెడుతుంటే.. ఆ అనుభూతే వేరు. ఎక్కడలేని శక్తి మొత్తం ఒక్కసారిగా వచ్చినట్టు.. పట్టలేనంత ఉత్సాహం. వెరసి వైజాగ్ నేవీ మారథాన్ – 2023 ఉత్సాహంగా హుషారుగా సాగింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, క్రీడాకారులతో సాగర తీరం కిక్కిరిసిపోయింది. మామ్ అండ్ డాడ్ తో మేము సైతం అంటూ చిన్నారులు, బుజ్జాయిలు ఉత్సాహంగా మారథాన్ లో పాల్గొనడం విశేషం.నాలుగు విభాగాల్లో పరుగు..ఈ ఈవెంట్‌లో 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిమీ రన్, 5 కిమీ రన్ నాలుగు విభాగాల్లో పరుగు నిర్వహించారు. ది పార్క్ హోటల్ సర్కిల్ నుంచి RK బీచ్, నావల్ కోస్టల్ బ్యాటరీ వైపు వెళ్లి.. RK బీచ్ కాళీమాత ఆలయం దగ్గర U-టర్న్ తీసుకున్నారు. 5K రన్ MGM పార్క్, VMRDA వద్ద ముగిసింది. 10కె రన్నర్లు తెన్నేటి పార్క్ దగ్గర యు-టర్న్ తీసుకున్నారు. హాఫ్ మారథాన్ రన్నర్లు రుషికొండ సమీపంలోని గాయత్రి కళాశాల దగ్గర యు-టర్న్ తీసుకుని తిరిగి వచ్చేసారు. ఫుల్ మారథాన్ రన్నర్లు INS కళింగ సమీపంలోని చేపల ఉప్పాడ దగ్గర U-టర్న్ తీసుకున్నారు. అన్ని రేసులు MGM పార్క్, VMRDA వద్ద ముగిసాయి.ఈ సంవత్సరం మారథాన్‌కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా మెడికల్ క్యాంపులతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శారీరక మానసిక ఆరోగ్యానికి మారథాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు ఈ ఎన్ సి చీఫ్ రాజేష్. విశాఖ వాసుల నుంచి వస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అశేషంగా హాజరైన జనంతో మరింత స్ఫూర్తి నింపిందన్నారు అడ్మిరల్ శ్రీనివాసన్. ఏటా మారథాన్ నిర్వహిస్తున్న నేవీని అభినందించారు సిపి రవిశంకర్ అయ్యనార్. తల్లిదండ్రులతో పాటు చిన్నారులు కూడా ఈ మారథాన్లో పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :