Tuesday, 14 May 2024 03:36:01 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మళ్ళీ మొదలైన గోదావరి అలలపై పాపికొండల షికారు

Date : 07 November 2022 02:48 PM Views : 250

తాజా వార్తాలు / తూర్పుగోదావరి జిల్లా : ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం మళ్లీ మొదలైంది. గోదావరికి వరదలు తగ్గడంతో పాపికొండల విహార యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుమతిచ్చింది. దీంతో గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం నేటి నుంచి మొదలయ్యింది. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం నుండి పాపికొండలు విహార యాత్రను నేటి నుండి అధికారులు ప్రారంభించారు. అయితే ఇటీవలి వరదలకు సుమారు మూడు నెలల పాటు పాపికొండల యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నదిలో నీటి మట్టం తగ్గడంతో యాత్రను మళ్ళీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు ప్రభుత్వ బోట్లలో సుమారు 100 మంది పర్యాటకులను సేఫ్టీ ప్రికాషన్ తో పాపికొండల తీరం దర్శించడానికి పయనం అయ్యాయి. అధికారులు పర్యవేక్షణ లో పర్యాటకులు పయనం అయ్యారు. దీంతో గండిపోచమ్మ బోట్ పాయింట్ వద్ద మళ్ళీ పర్యటక సందడి వాతావరణం నెలకొంది. అయితే ముందుగా ఈ మేరకు అధికారులు గోదావరిలో బోట్ ట్రయల్ రన్ నిర్వహించారు. గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటకులు బోటెక్కడానికి వీలుగా పంటు ఏర్పాటుచేశారు. పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంక్రాంతి తర్వాత పాపికొండల యాత్రను నిలిపేసేవారు.. నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇసుక దిబ్బలకు తగిలి బోట్లు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో యాత్రను ఆపేసేవారు. అయితే, పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో పాపికొండల్లో గోదావరి నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో వేసవిలోనూ కొనసాగించాలని ఈ ఏడాది మొదట్లోనే అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :