Tuesday, 14 May 2024 08:32:12 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్ధమేంటి..?

Date : 06 September 2023 04:06 PM Views : 163

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవ‌హారం రోజురోజుకూ ముదురుతుంది. లెక్కల్లో చూప‌ని న‌గ‌దుగా ఉన్న 118 కోట్లకు సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. ఆగ‌స్ట్ నాలుగో తేదీన హైద‌రాబాద్‌లో చంద్రబాబు నివాసం అడ్రస్‌తో ఈ నోటీసులు పంపించారు. ఇటీవ‌ల ఈ విష‌యం జాతీయ మీడియా ద్వారా బ‌య‌ట‌కు పొక్కడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న‌కు ఆయుధంగా మ‌లుచుకుంది. మొద‌టి నుంచి రాజ‌ధాని విష‌యంలో అక్రమాలు జ‌రిగాయ‌ని, అసైన్డ్ ల్యాండ్స్ వ్యవ‌హారంలో కూడా భారీ స్కాం జ‌రిగింద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. ఇప్పటికే ఆయా కేసుల‌కు సంబంధించి చంద్రబాబుతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై హైకోర్టులో కేసులు కూడా న‌డుస్తున్నాయి. దీంతో చంద్రబాబు అవినీతి అంశంపై నోరు మెద‌పాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ నోటీసులుపై చంద్రబాబు మౌనం వీడాలంటున్నారు వైసీపీ నేత‌లు.. కొంత‌కాలంగా ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు అవినీతి విష‌యాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, ముడుపుల కేసుల‌కు సంబంధించి ఐటీ నోటీసుల వ్యవ‌హారంలో కీల‌క‌మైన మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసానికి ఇత‌ర స్కాంల్లో నిందితుల‌కు ద‌గ్గరి సంబంధాలున్నట్లు గుర్తించింది సీఐడి. దీంతో మ‌నోజ్ వాసుదేవ్‌తో పాటు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాల‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐటీ నోటీసుల‌కు తోడు ఈ ఇద్దరికీ సిఐడీ నోటీసులు జారీ చేయ‌డంతో చంద్రబాబుకు స‌మ‌స్యలు చుట్టుకుంటాయని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :