Tuesday, 14 May 2024 08:17:24 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో పెరిగిన మద్యం ధరలు..

Date : 18 November 2023 06:38 PM Views : 75

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది. క్వార్టర్ సీసాపై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గుదల కనిపించింది. అయితే అవి ఇక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల వాటి ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.ప్రస్తుతం వ్యాట్‌ వసూళ్లలో మార్పులు తీసుకురావడం వల్ల తరచూ విక్రయించే బ్రాండ్లపై కొంత భారం పడింది. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10-40 వరకూ, హాఫ్ బాటిల్‌పై రూ. 10-50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ. 10-90 వరకూ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మద్యం బాటిళ్లపై ఉన్న ఐఎంఎఫ్ఎల్ ఆధారంగా పన్నుల శాతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150శాతం పన్నులు విధించినట్లు తెలిపారు. ఇక బీరుపై 225%, వైన్‌పై 200%, విదేశీ మద్యంపై 75% ఎఆర్ఈటీ ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ బ్రాండ్ల పై ఉన్న ధరలను చాలా కాలంగా పెంచలేదని, వాటి రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా ప్రస్తుతం పెంచామని వివరించారు. గతంలో 180ఎంఎల్ లిక్కర్ సీసా ధర రూ. 150 కాగా ప్రస్తుతం అలాగే ఉంది. అయితే 750 ఎంఎల్ మద్యం బాటిల్ ధర గతంలో 800 కాగా ఇప్పుడు కూడా అలాగే స్థిరంగా ఉంది. కొన్ని 180ఎంఎల్ లిక్కర్ బ్రాండ్ల పై రూ. 200 నుంచి రూ. 210 పెరిగింది. అంటే రూ. 10 అదనంగా చెల్లించాలి. కొన్ని 750 ఎంఎల్ లిక్కర్ సీసా ధర గతంలో రూ. 4330 ఉండగా ప్రస్తుతం రూ. 5450కి పెరిగింది. అంటే.. రూ. 1120 పెరిగిందన మాట. ఇలా కొన్నింటిపై ట్యాక్స్ ప్రభావం పడితే.. మరి కొన్నింటిపై స్థిరంగా కొనసాగుతోంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :