Wednesday, 15 May 2024 03:46:07 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చంద్రబాబుకు బెయిల్‌పై అభ్యంతరం.. స్కిల్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..

Date : 21 November 2023 04:22 PM Views : 115

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్‌ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతోంది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ట్రయల్‌ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా బెయిల్‌ ఎలా ఇస్తారంటోంది ఏపీ ప్రభుత్వం. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్‌ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తోంది.స్కిల్‌ కేసులో సెప్టెంబర్‌ 9న చంద్రబాబు అరెస్ట్‌ కాగా, సెప్టెంబర్‌ 10నుంచి అక్టోబర్‌ 31వరకు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలతో అక్టోబర్‌ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. 20రోజుల తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపైనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. చంద్రబాబు లాయర్లు వాదించని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎలా బెయిల్‌ ఇస్తారంటోంది. ట్రయల్‌ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం ఏంటనేది ఏపీ ప్రభుత్వం వాదన. ఇదిలాఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. గతంలో ఈ కేసులో హైకోర్టు ఇవాళ్టివరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ విచారణపై సైతం స్టే కొనసాగుతోంది.మద్యం కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :