Tuesday, 14 May 2024 09:23:10 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మీ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేశారా? చివరి తేదీ ఇదే.. లేదంటే తిప్పలు తప్పవు

Date : 14 February 2023 05:18 PM Views : 189

తాజా వార్తాలు / అమరావతి : మీ ఆధార్‌ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్‌ చేశారా? ఇంకా లేదంటే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను మార్చి 31, 2023లోగా వెంటనే అనుసంధానం చేయండి. ఒకవేళ ఎవరైనా గడువు తేదీలోగా లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ పాన్ హోల్డర్‌లు మార్చి 2023 చివరి నాటికి ఆధార్‌తో కార్డును లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టం ప్రకారం.. మినహాయింపు వర్గంలోకి రాని పాన్-హోల్డర్లందరికీ తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. పాన్, ఆధార్‌ను లింక్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. భారత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా పాన్-ఆధార్‌ల లింక్ ఎలా చేయవచ్చంటే.. తొలుత అధికారిక వెబ్‌సైట్‌ eportal.incometax.gov.in ను ఓపెన్‌ చెయ్యాలి. పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు యూజర్ పాన్ లేదా ఆధార్ నంబర్ యూజర్ ఐడీగా వినియోగించవచ్చు. తర్వాత పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. హోమ్‌పేజీలో ‘Quick Links’పై క్లిక్ చేయాలి. తర్వాత లింక్ ఆధార్ ఆఫ్షన్‌పై క్లిక్‌ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పేరును, నంబర్‌ను యాడ్ చేయాలి. తర్వాత ‘I have only year of birth in Aadhaar card’ అనే బాక్సును ఎంపిక చేసుకోవాలి. Captchaను తప్పులులేకుండా టైప్ చేసి సబ్‌మిట్‌ చేయాలి. ఆధార్, పాన్ కార్డ్ లింక్ అయిన తర్వాత మీకు నిర్ధారణ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీ పాన్, ఆధార్ కార్డ్ వివరాలు సరిపోలకపోతే.. మీకు రిజెక్ట్‌ మెసేజ్ వస్తుంది. తర్వాత మళ్లీ పై విధంగా అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేస్తే సరిపోతుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :