Tuesday, 14 May 2024 04:31:50 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Date : 17 May 2023 07:17 PM Views : 153

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్ అవ్వనున్నారు.ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న బ్యాన్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిక్వెస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో .. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉండనుంది. గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని రిక్వెస్ట్‌పై బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంది. టీచర్లతో పాటు పలు ఇతర ఉద్యోగులకు విడిగా గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నులు, రవాణా, వ్యవసాయ శాఖల్లో పని చేసే ఉద్యోగుల బదిలీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్యాన్ వర్తించనుందని ప్రభుత్వం పేర్కొంది. ఎంప్లాయిస్ బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలపై ఫోకస్ పెడతామని గవర్నమెంట్ వివరించింది. ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగ్‌లో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆయా శాఖలకు ఆర్దిక శాఖ ఆదేశించింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :