Tuesday, 14 May 2024 04:42:41 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఎండ, ఉక్కపోత నుంచి రిలీఫ్.. ఏపీలో వచ్చే 2 రోజులు వర్షాలు

Date : 18 May 2023 05:59 PM Views : 171

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఏపీలో ఎండల నుంచి కాస్త ఉపశమనం దక్కనుంది. అవును.. పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదు కావొచ్చని తెలిపింది.హాయ్.. హల్లో.. ఏపీ వెదర్ రిపోర్ట్‌ను తీసుకొచ్చేశాం. నైరుతి రుతుపవనాలు రాబోవు 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులకు విస్తరించే అవకాశమున్నది. ద్రోణి/గాలుల కోత ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో తక్కువగా గుర్తించబడింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 3°లు తక్కువుగా నమోదు కావచ్చును. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును. శనివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 3° లు తక్కువుగా నమోదు కావచ్చును. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును. శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును. ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.రాయలసీమ :- గురువారం, శుక్రవారం:- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C వరకు ఎక్కువుగా నమోదు కావచ్చును. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును . శనివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C వరకు ఎక్కువుగా నమోదు కావచ్చును వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :