Tuesday, 14 May 2024 07:54:31 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం..

Date : 17 August 2023 07:00 PM Views : 219

తాజా వార్తాలు / అమరావతి : ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో.. రేపటికి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏపీలో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖవర్షాకాలంలోనూ.. గత వారం పది రోజులుగా.. ఎండ వేడి ఉక్కపొతతో అల్లడిన ఏపీ ప్రజలకు చల్లని కబురు. రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 18న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడెందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. దీంతో వాతావరణం చల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో.. రేపటికి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏపీలో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.మాన్సూన్ సీజన్ అయినప్పటికీ.. జూలైలో కురిసిన వర్షాలు ఆగస్టులో లేవు. రుతుపవన ద్రోణ భారతదేశం వైపు ఉంది. మరోవైపు రుతుపవనాలు బలహీనంగా మారాయి. వాస్తవానికి వర్షాకాలంలో మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వల్ల ఉష్ణోగ్రతలో తగ్గుతాయి వాతావరణం చల్లబడుతుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో నిర్మలంగా మారింది. దీంతో సూర్యుని కిరణాలు నేరుగా భూమి పైకి పడుతున్నాయి. ఆ కారణంగా ఆగస్టు మొదటి పక్షంలో.. ఉష్ణోగ్రతలు , ఎండ తీవ్రత పెరిగింది. చాలా చోట్ల ఈ సీజన్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.ఆ రోజుల్లో విస్తారంగా వర్షం.. అయితే.. బంగాళాఖాతంలో ప్రస్తుత పరిస్థితులు అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూలంగా మారాయి. దీంతో రాగల వారం రోజుల్లో.. ఏపీ వ్యాప్తంగా తెలుగు నుంచి మోస్తారు వర్షాలు.. కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈనెల 18, 19 తేదీల్లో భారీ వర్ష సూచన కూడా ఉందని చెబుతున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్.ఆ జిల్లాకు..అయితే నెల్లూరు జిల్లాలో.. ఉష్ణోగ్రతలు కొనసాగి క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. గత వారం రోజులుగా ఏపీలో 38 డిగ్రీల వరకు చాలాచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇకనుంచి క్రమంగా ఉష్తంత్ర తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :