Tuesday, 14 May 2024 09:47:02 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఇక నుంచి ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను వాట్సప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Date : 10 November 2022 06:45 PM Views : 202

తాజా వార్తాలు / అమరావతి : ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను ట్రా చేయడం ఇప్పుడు మరింత సులభతరం చేసింది భారత రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్‌లోనూ రియల్ టైమ్ ట్రైన్ రన్నింగ్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్‌ను చూడొచ్చు. ముంబైకి చెందిన స్టార్టప్ రైలోఫీ-రోడియో ట్రావెల్ టెక్నాలజీస్‌తో కలిసి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ప్రయాణికులు తమ రైలు స్థితిని, పీఎన్ఆర్ వివరాలను వాట్సాప్‌ ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.వాట్సాప్‌లో PNRని ఎలా చెక్ చేయాలంటే.. స్టెప్ 1: ముందుగా మీ మొబైల్‌లో రైలోఫీ నంబర్ 9881193322 ని సేవ్ చేసుకోవాలి. స్టెప్ 2: ఈ నెంబర్‌ను సేవ్ చేసిన తరువాత మీ వాట్సాప్ ఓపెన్ చేయాలి. స్టెప్ 3: వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయాలి. ఆ తరువాత మీ వాట్సాప్‌లో సేవ్ చేసిన నెంబర్‌ను వెతకాలి. స్టెప్ 4: చాట్ విండో తెరిచిన తరువాత.. మీరు మీ 10 అకెంల PNR నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి. స్టెప్ 5: ఆ తరువాత రైలోఫీ చాట్‌బాట్‌లో మీ ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తుంది. ట్రైన్ రియల్ టైమ్ లొకేషన్, నోటిఫికేషన్స్ అన్ని వివరాలను తెలియజేస్తుంది. ఫోన్ కాల్, మెసేజ్ కూడా చేయొచ్చు.. కాగా, PNR స్టేటస్‌ని స్మార్ట్ ఫోన్ ద్వారా 139 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. 139, 5676747 నెంబర్లకు మెసేజ్ సెండ్ చేయడం ద్వారా కూడా PNR స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. ఇదిలాఉంటే.. IRCTC జూప్ చాట్‌బాట్ ద్వారా రైలు ప్రయాణంలో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. ఇందుకోసం ప్రయాణికులు +91 7042062070 సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా ఈ ఫుడ్ ఆర్డర్ సౌకర్యాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా రెస్టారెంట్‌లను ఎంచుకుని, డెలివిరీ కోసం రాబోయే స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :